గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు మరోమారు చర్చించింది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ప్రాజెక్టులు, పంప్ హౌస్‌లు, ప్లాంట్లకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఉపసంఘం కోరింది.
GRMB: ప్రాజెక్టుల వివరాలు కోరిన జీఆర్‌ఎంబీ ఉపసంఘం - జీఆర్‌ఎంబీ ఉపసంఘం వార్తలు
22:33 September 20
GRMB: ప్రాజెక్టుల వివరాలు కోరిన జీఆర్‌ఎంబీ ఉపసంఘం
అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా వివరాలు అందించాలని సూచించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ అధికారులు ఉపసంఘానికి తెలిపారు. నిర్వహణ కోసం సిబ్బందులు, మౌలికవసతుల వివరాలు అందిస్తామని ఏపీ అధికారులు చెప్పారు.
అమలు ప్రక్రియ కోసం
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ(grmb) , కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి :న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్