తెలంగాణ

telangana

ETV Bharat / city

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై - రాజ్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు. రాజ్​ భవన్​లో జరిగిన ఈ వేడుకల్లో 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ తెలుగులో ఆలపించారు.

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై

By

Published : Sep 30, 2019, 8:26 PM IST

Updated : Sep 30, 2019, 10:19 PM IST

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై

బతుకమ్మ సంబురాలను రాజ్ భవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బంగారం, దుస్తులతో పాటు పూలను బాగా ఇష్టపడతారని... శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ 'బతుకమ్మ' అని గవర్నర్ అభివర్ణించారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ తెలుగులో చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు 200 మహిళలు పైగా పాల్గొన్నారు. రాజ్ భవన్ ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి ఓ గంట పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. 1 తేదీన మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థినిలు, 5న రాజ్ భవన్ మహిళా ఉద్యోగినులు, రాజ్ భవన్ పరివారం పాల్గొంటారని వెల్లడించారు.

Last Updated : Sep 30, 2019, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details