హైదరాబాద్‌లో గ్రీన్ ఛానల్ ద్వారా.. గుండెను విజయవంతంగా తరలించడంలో భాగస్వాములైన వారందరిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. మెట్రో మార్గం ద్వారా రికార్డు సమయంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి మరొకరికి గుండెను అందించి......... ప్రాణదాతలుగా నిలిచారని గవర్నర్ కొనియాడారు.
మెట్రోలో గుండె తరలింపుపై గవర్నర్ ప్రశంస - Hyderabad Metro transports heart for transplant
హైదరాబాద్ మెట్రో గ్రీన్ ఛానల్ ద్వారా.. గుండెను విజయవంతంగా తరలించడంలో భాగమైన వారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ ఘటన ఎందరిలోనో స్ఫూర్తి రగిలించిదని వ్యాఖ్యానించారు.
మెట్రోలో గుండె తరలింపుపై గవర్నర్ ప్రశంస
ఆ క్రతువులో సమయస్ఫూర్తి తో వేగంగా స్పందించిన పోలీస్, హైదరాబాద్ మెట్రో, దాత కుటుంబాన్ని గవర్నర్ అభినందించారు. ఆ ఘటన ఎందరిలో స్ఫూర్తిని రగిలించిందన్న ఆమె... అవయవ దానం ప్రాణాలను నిలిపే సంజీవని అని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :గుండె ప్రయాణం : 21 కిలోమీటర్లు... 30 నిమిషాలు...