కొవిడ్ మహమ్మారి వేళ పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. అమెరికా చికాగోలోని మెట్రోపాలిటన్ ఏషియన్ ఫ్యామిలీ సదస్సులో గవర్నర్ దృశ్యమాధ్యమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పెద్దలు మనపట్ల ఎంతో ప్రేమ, దయ చూపారన్న తమిళిసై... వారి బాగోగులను చూసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పెద్దలకు ఉండే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కరోనా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని, వారి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
'పెద్దలు మనపట్ల ఎంతో ప్రేమ చూపించారు.. ఇప్పడు అది మన బాధ్యత'
పెద్దలు మనపట్ల ఎంతో ప్రేమ, దయ చూపారని... వారి బాగోగులను చూసుకోవడం మనందరి బాధ్యతని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పెద్దలకు ఉండే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కరోనా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని, వారి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొన్ని కుటుంబాలు పెద్దలను దూరంగా పెడుతున్నాయన్నారు. అటువంటి పరిణామాలు మంచివి కావని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నో ఆటుపోట్లను విజయవంతంగా ఎదుర్కొన్న పెద్దలకు ఎంతో అనుభవం ఉందని గవర్నర్ అన్నారు. కొన్ని కుటుంబాలు పెద్దలను దూరంగా పెడుతున్నాయన్న తమిళిసై... అటువంటి పరిణామాలు మంచివి కావని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పట్ల వారిలో అవగాహన కల్పించడంతో పాటు వారు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పెద్దల ఆరోగ్యం కోసం పిడియాట్రిక్స్ లాగే జెరియాట్రిక్స్కు ప్రాధాన్యత పెరగాలని తమిళిసై అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!