తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఉన్నత విద్యలో తెలంగాణ లీడర్​గా నిలవాలి' - 'ఉన్నత విద్యలో తెలంగాణ లీడర్​గా నిలవాలి'

ఉన్నత విద్యలో రాష్ట్రం... దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. సంతోషంగా నేర్చుకునే ఒత్తిడి లేని విద్యావిధానం అవసరమన్నారు. ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలో యోగాను చేర్చాలని గవర్నర్ సూచించారు. సామాజిక కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాలు పాలుపంచుకోవాలని.. గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు.

'ఉన్నత విద్యలో తెలంగాణ లీడర్​గా నిలవాలి'

By

Published : Oct 4, 2019, 4:39 AM IST

Updated : Oct 4, 2019, 8:44 AM IST

'ఉన్నత విద్యలో తెలంగాణ లీడర్​గా నిలవాలి'

రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సూచించారు. గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కులపతిగా తొలిసారి యూనివర్సిటీలపై సమీక్షించారు. విశ్వవిద్యాలయాలు సామాజిక అభివృద్ధి కేంద్రాలుగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు.. సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని.. గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీ అధ్యాపకులు సామాజిక బాధ్యతగా... కేంద్ర, రాష్ట్ర పథకాలు సరైన దిశగా అమలయ్యేందుకు ప్రయత్నించాలని కోరారు.

ఒత్తిడి లేని విద్యావిధానం ఉండాలి

ఉన్నత విద్యలో ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందని తమిళిసై చెప్పారు. విద్యార్థులు సంతోషంగా నేర్చుకునేలా... ఒత్తిడి లేని విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. పాఠ్య ప్రణాళికలో యోగాను చేర్చాలన్నారు. సాంకేతిక, వృత్తి విద్యల్లో అమ్మాయిలను ప్రోత్సహించి.. దేశ ఆర్థికాభిృవృద్ధికి విశ్వవిద్యాలయాలు దోహదపడాలని కోరారు. అభివృద్ధి కోసం.. విశ్వవిద్యాలయాలు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని తెలిపారు. ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం... దేశంలో లీడర్​గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో అమలవుతున్న కార్యక్రమాలు.. భవిష్యత్ ప్రణాళికలను ఉన్నత విద్య మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గవర్నర్​కు వివరించారు.

యూనివర్సిటీలో తరచుగా సమావేశం నిర్వహించనున్నట్లు తమిళిసై తెలిపారు. సమావేశంలో 11 యూనివర్సిటీల ఇంఛార్జీ వీసీలు, రిజిస్ట్రార్​లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: "బతుకమ్మకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి"

Last Updated : Oct 4, 2019, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details