గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పేర్లు ఖరారు - baswaraju saraiah as mlc
17:40 November 13
గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పేర్లు ఖరారు
పెద్దల సభలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
ఈ పేర్లను ప్రభుత్వం... గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపింది. శాసనసభ, శాసన మండలి ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చూడండి: కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి