ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయ్ అనే నినాదంతో యూనివర్సిటీ విద్యలో సమూల ప్రక్షాళన చేయనున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. నేటి నుంచి జూన్ 30వరకు వర్సిటీల సమస్యలు-విద్యావిధానంలో మార్పుల-చేర్పులపై వీసీలు, విభాగాధిపతులు, అధ్యాపకులతో ఆన్‌లైన్ అధ్యాయానాన్ని చేపట్టారు. వర్సిటీల్లో వీసీలు, అధ్యాపకుల ఖాళీలను త్వరలోనే పూర్తి చేయనున్నామని గవర్నర్ తెలిపారు.
ప్రక్రియ మరింత వేగవంతం..
కరోనా లాక్డౌన్ కంటే ముందే ఈ అంశంపై ముఖ్యమంత్రితో విస్తృతంగా చర్చించామని... ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మీడియాకు వివరించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి వర్సిటీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే వీసీలకు సూచించినట్లు ఆమె వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ రోజున..
భౌతిక దూరాన్ని పాటిస్తూ తరగతుల నిర్వహణ, వసతి గృహాలు తెరవడంపై దృష్టిసారించామన్నారు. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థుల మేథాశక్తిని పరీక్షించడం, పెంపొందించేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహించినట్లు గవర్నర్ వెల్లడించారు. రూ.6వేల పైచిలుకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. విజేతలకు రాష్ట్ర అవతరణ రోజు బహుమతులు అందజేయనున్నారు.
యూనివర్సిటీ విద్యలో సమూల ప్రక్షాళన: గవర్నర్ ఇవీ చూడండి:తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్