కరోనా వైరస్ సోకే ముప్పును, ఆ రోగి దగ్గరికి వచ్చినప్పుడు తెలియజేసే యాప్‌ను కేంద్రం ఆందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య సేతు యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించింది. ఈ యాప్ కేవలం కొత్త కేసులను గుర్తిస్తుందని, కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారికి అప్రమత్తత సందేశాలు పంపిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
కరోనా యాప్: వైరస్ ముప్పును ముందే చెబుతుంది! - covid 19
కరోనా వైరస్ సోకే ముప్పును అంచనా వేసుకోవడంలో ప్రజలకు సహకరించేందుకు ఓ యాప్ వచ్చేసింది. కరోనా సోకిన రోగి దగ్గరకి వస్తే... మొబైల్ అప్రమత్తం చేస్తుంది. ఈ సరికొత్త యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘ప్రతి భారతీయుడి ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆరోగ్య సేతు యాప్ డిజిటల్ ఇండియాలో చేరింది. కరోనా వైరస్ బారిన పడే ముప్పు తమకు ఎంత ఉందనే విషయాన్ని దీనిద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు. ఇతరులతో కలిసే సందర్భాలను బట్టి వారు వైరస్ బారినపడే ముప్పును యాప్ గణిస్తుంది.
అత్యాధునిక బ్లూటూత్ టెక్నాలజీ, అల్గోరిథమ్స్, కృత్రిమ మేధల ఆధారంగా ఇది సాధ్యమవుతంది’’ అని గురువారమిక్కడ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఒక వ్యక్తికి పరీక్షలు నిర్వహించాక కొవిడ్-19 బారిన పడినట్లు తేలితే.. వెంటనే అతని వివరాలతోపాటు మొబైల్ నంబర్‌ను ఆరోగ్య మంత్రిత్వశాఖ రికార్డులతోపాటు యాప్‌లోనూ నమోదు చేస్తారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకూ ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది.