తెలంగాణ

telangana

ETV Bharat / city

అభివృద్ధి, క్యాపిటల్‌ వ్యయంలో రాష్ట్రం ముందంజ: కాగ్ - telangana cag report

కాగ్‌ నివేదికను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర జీఎస్‌డీపీతో పోల్చితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చులు తగ్గాయని కాగ్‌ పేర్కొంది. 2016-17లో పెరిగిన క్యాపిటల్‌ వ్యయం 2017-18లో తగ్గిందని వెల్లడించింది. ప్రాథమిక లోటు తగ్గినా.. ఖర్చులను తీర్చేస్థాయిలో అప్పులే కాని రాబడి లేదని పేర్కొంది.

cag report

By

Published : Sep 22, 2019, 11:10 AM IST

కాగ్ నివేదికలోని అంశాలు

  1. బడ్జెట్‌ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్‌ తయారీ ప్రక్రియను ఆర్థికశాఖ హేతుబద్ధం చేయాలి
  2. బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే రెవెన్యూ రాబడి రూ.24,259 కోట్లు తగ్గింది
  3. బడ్జెట్‌ అంచనాల కన్నా రెవెన్యూ ఖర్చులు రూ.23,147 కోట్లు తగ్గాయి
  4. గత మూడేళ్లుగా రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో సమర్థత పెరిగింది
  5. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి వ్యయం, క్యాపిటల్‌ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉంది
  6. విద్యారంగంలో మాత్రం వెనుకబడింది
  7. గత కొన్నేళ్లుగా అప్పులపై అధికంగా ఆధారపడటంతో చెల్లింపు బాధ్యతలు పెరిగాయి
  8. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మౌలికసదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది
  9. డిస్కంల పునరుత్తేజం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి
  10. సాగునీటి ప్రాజెక్టులపైన ఇప్పటివరకు రూ.70,758 కోట్లు ఖర్చయ్యాయి

ABOUT THE AUTHOR

...view details