తెలంగాణ

telangana

ETV Bharat / city

కాళేశ్వరం... రాష్ట్రానికి మణిహారం: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని.. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం దృష్టిని ఆకర్షించి చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.

కాళేశ్వరం...రాష్ట్రానికి మకుటాహారం: గవర్నర్‌ తమిళిసై

By

Published : Sep 9, 2019, 8:55 PM IST


గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు గణేశ్‌, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని.. 2019-20 సంవత్సరానికి రాష్ట్రం 14.84 జీఎస్‌డీపీ సాధించిందని గవర్నర్‌ తెలిపారు. 2014లో రాష్ట్ర ఆదాయం రూ.4 లక్షల కోట్లు మాత్రమే ఉందని.. ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ గణాంకాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తమిళిసై తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం దృష్టిని ఆకర్షించి చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని.. కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.

కాళేశ్వరం... రాష్ట్రానికి మణిహారం: గవర్నర్‌ తమిళిసై

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details