Godavari flood effect on yanam: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో గోదావరి నది పరివాహక ప్రాంతం ముంపునకు గురైంది. కాకినాడ జిల్లాలో అంతర్భాగం.. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన యానాం ముంపునకు గురైంది. పర్యాటక ప్రాంతాలైన బాలయోగి, రాజీవ్ గాంధీ బీచ్, భరతమాత విగ్రహం వద్ద భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరిగింది. ముంపు ప్రాంతాలను పుదుచ్చేరి, దిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పడవపై వెళ్లి పరిశీలించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
- ధవళేశ్వరం వద్ద గోదావరిలో పెరిగిన వరద ఉద్ధృతి
- కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- కాటన్ బ్యారేజీపై వాహన రాకపోకలు నిలిపివేత
- ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 18.30 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి పంట కాల్వలకు 5 వేల క్యూసెక్కులు విడుదల
- సముద్రంలోకి 20 లక్షల క్కూసెక్కులు విడుదల