తనకు నక్సలైటుగా మారిపోయేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్లో తనకు శిరోముండనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ
తనకు నక్సలైటుగా మారిపోయే అవకాశం కల్పించాలని కోరుతూ.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తనకు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో ఏ7 అయిన ఎస్సైపై తప్ప.. మిగిలిన ఏ1 నుంచి ఏ6 అయిన.. వైకాపాకు చెందిన నేతలపై చర్యలు తీసుకోలేదని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని లేఖలో కోరాడు.
ap
ఈ ఘటనలో ఏ1 నుంచి ఏ7 వరకూ కేసులు నమోదు చేశారని... ఏ7 అయిన ఎస్సైపై చర్యలు తీసుకున్నప్పటికీ.. వైకాపాకు చెందిన మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నాడు. వారిపైనా చర్యలు తీసుకొని.. తనకు న్యాయం చెయ్యాలని ప్రసాద్ లేఖలో కోరాడు.