Viral video: ప్రేమించి మోసం చేసే యువకులకు ఓ చక్కని గుణపాఠం చెప్పింది ఏపీలోని కర్నూలుకు చెందిన యువతి. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని నలుగురిలో ప్రియుడిని నిలదీసింది. అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని బడితె పూజ చేసింది. తాళి కడతావా.. చస్తావా అంటూ చితకబాదింది.
Viral video: 'పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆమె ఎంత పని చేసిందంటే..!' - girl beat her boyfriend for cheating
Viral video: తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుంటానని మొహం చాటేశాడని ఆగ్రహానికి గురైన యువతి.. ప్రియుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రేమికుడిని రోకలితో చితకబాదిన యువతి
జిల్లాలోని పెద్దటేకూరుకు చెందిన ఓ యువతిని కల్లూరు మండలం చిన్న టేకూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమించాడు. ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మొహం చాటేస్తున్నాడు. ప్రియుడి మోసంతో ఆగ్రహానికి గురైన యువతి తాళి కట్టాలంటూ స్థానికంగా ఉన్న ఓ దేవాలయంలో అందరిముందే అతన్ని కర్రతో చితకబాదింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి:
Last Updated : Feb 22, 2022, 3:46 PM IST