జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన... స్టాడింగ్ కమిటీ సమావేశమైంది. జీహెచ్ఎంసీలోని 3,142 మంది శాశ్వత ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లైమ్ పాలసీ వర్తింపు, 49 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించడం, పలు జంక్షన్లు, సెంట్రల్ మీడియంలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద అభివృద్ధి చేయడం, నగరంలో కొత్తగా 700 ట్రాఫిక్ కంట్రోల్ గొడుగుల ఏర్పాటు వంటి ఎజెండాలోని 20 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకు ఆమోదం - జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన సమావేశమైన స్టాండింగ్ కమిటీ... ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకు ఆమోదం