తెలంగాణ

telangana

ETV Bharat / city

తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు - MANHOLES

హైదరాబాద్​లో వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ నిండిపోయి మ్యాన్​హోల్స్ తెరుచుకుంటాయి. విద్యుత్ తీగలు తెగిపడిపోతాయి. కాలు కింద పెట్టాలంటేనే జనం వణికిపోతుంటారు. కానీ జీహెచ్​ఎంసీ వర్షం పడిన వెంటనే రంగంలోకి దిగి సమస్యలను తీరుస్తున్నారు.

తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

By

Published : Jun 25, 2019, 10:58 AM IST

Updated : Jun 25, 2019, 1:19 PM IST

హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. శేర్లింగంపల్లిలో 2 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ వర్షాకాల బృందాలు మ్యాన్ హోల్స్, క్యాచ్ పిట్​లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించారు. ట్యాంక్​బండ్ వద్ద నిలిచి ఉన్న నీటిని తొట్టెలతో తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో రహదారులపై పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. రోడ్ల పరిశుభ్రత కోసం 30 అదనపు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ దానకిషోర్ పేర్కొన్నారు.

తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు
Last Updated : Jun 25, 2019, 1:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details