తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు - జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​

ghmc notification
ghmc notification

By

Published : Nov 17, 2020, 8:20 AM IST

Updated : Nov 17, 2020, 11:56 AM IST

08:17 November 17

జీహెచ్​ఎంసీ పోరు: డిసెంబరు 1న బల్దియా పోలింగ్

ghmc notification
డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 4న జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పదవి మహిళ(జనరల్)కు కేటాయించినట్లు పేర్కొన్న ఎస్​ఈసీ... బ్యాలెట్​ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు... 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. డిసెంబర్ 1న ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్​ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

రిజర్వేషన్లు...

  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్టీ-2(జనరల్‌ 1, మహిళ1)
  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్సీ-10‍‌(జనరల్‌ 5, మహిళలు 5)
  • జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: బీసీ-50(జనరల్‌ 25, మహిళలు 25)
  • జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు: జనరల్ మహిళ-44, జనరల్-44

పోలింగ్​ కేంద్రాలు...

  • గ్రేటర్ పరిధిలో 1,439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • గ్రేటర్‌లో 1,004 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • గ్రేటర్‌లో 257 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం



 

ఇదీ చూడండి: ‘గ్రేటర్‌’ ఎన్నికలకు అన్ని పార్టీల కసరత్తు షురూ..


 

Last Updated : Nov 17, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details