హైదరాబాద్ చందానగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో 8 వసతిగృహాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి అధికారులు తాఖీదులు అందజేశారు. ఎనిమిదేళ్లుగా కళాశాల అనుబంధంగా 8 హాస్టళ్లను నిర్వహిస్తుందని... ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్ బకాయిలు 32లక్షల 56వేలు చెల్లించాల్సిందిగా నోటీసులు స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్‌పై కళాశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మాతృశ్రీ నగర్‌లో ఉన్న వసతిగృహాన్ని డిప్యూటీ కమిషనర్ సీజ్ చేశారు. కేవలం మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.
ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి జీహెచ్‌ఎంసీ నోటీసులు - ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి జీహెచ్‌ఎంసీ నోటీసులు
హైదరాబాద్ చందానగర్‌లో 8 వసతిగృహాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కళాశాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు తాఖీదులు అందజేశారు.మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని మరోరెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన డిప్యూటీ కమిషనర్... ఆ వసతిగృహాన్ని సీజ్ చేశారు.
ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి జీహెచ్‌ఎంసీ నోటీసులు