తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో ఫ్లెక్సీ వార్.. చేతులెత్తేసిన జీహెచ్​ఎంసీ అధికారులు

హైదరాబాద్​ నగరవ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా భారీగా తెరాస, భాజపా శ్రేణుల ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్నటి వరకు ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ ఇవాళ ఫ్లేక్సీలపై జరిమానా విధింపు నిలిపివేసింది.

GHMC
GHMC

By

Published : Jul 2, 2022, 2:18 PM IST

భాగ్యనగరంలో రహదారులపై ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా భాజపా, తెరాస శ్రేణులు ఎలాంటి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

నగరంలో ఎక్కడ చూసినా అధికార తెరాసతోపాటు భాజపా లకు చెందిన ఫ్లెక్సీలు, వాల్​పోస్టర్లు, కటౌట్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటిపై నిన్నటి వరకు ఫైన్​ విధించిన జీహెచ్​ఎంసీ డీఆర్​ఎఫ్ అధికారులు నేడు జరిమానా విధింపు ఆపేశారు. శుక్రవారం వరకు అనుమతి లేని ఫ్లెక్సీలకు ఈవీడీఎం భాజపాకు 2 లక్షలు, తెరాసకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతంలో నగరవాసులు టూలెట్ బోర్డు పెడితే ఫైన్ వేశారు. ఇదిలా ఉంటే మరోవైపు డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ సర్వర్​ డౌన్​ అయింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details