తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేటీఆర్ చెప్పాలి.. మా కుటుంబాలనెలా పోషించుకోవాలో?' - మేడ్చల్​ వార్తలు

మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం ముందు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. పనులు చేస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు.

contractors protest
జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన

By

Published : Dec 18, 2020, 4:09 PM IST

జీహెచ్ఎంసీ పరిధిలో ఎనిమిది నెలల నుంచి ఒక్క రూపాయీ ఇవ్వలేదని.. కాంట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

హైదరాబాద్​లో మమ్మల్ని కూలీలకంటే హీనంగా చూస్తున్నారు. పనులు చేస్తున్నా డబ్బులు ఇవ్వడంలేదు. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. -జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు

తమ సమస్యలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తాము పనులు చెయ్యబట్టే ప్రజలు నిత్యం రోడ్ల మీద తిరుగుతున్నారని తెలిపారు. డబ్బులు చెల్లించకపోతే 'నో పేమెంట్ నో వర్క్​'లో ఉంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ప్రకృతి వనం పేరు చెప్పి మా పొట్ట కొట్టారు.!

ABOUT THE AUTHOR

...view details