తెలంగాణ

telangana

ETV Bharat / city

"4 రోజులు... లక్ష్యం రూ. 300 కోట్లు"

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను చెల్లింపునకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువుందని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 300 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు.

ghmc

By

Published : Mar 28, 2019, 7:11 AM IST

Updated : Mar 28, 2019, 9:12 AM IST

జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​
జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సిటిజన్​ సర్వీస్​ సెంటర్లను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు కమిషనర్​ దాన కిశోర్​ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తి పన్ను చెల్లించడానికి మరో నాలుగు రోజుల గడువు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరో 300 కోట్లు రావాలి

ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 300 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించారు. నాలుగు రోజుల్లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లింపుదారులు వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చి 31న అర్ధరాత్రి వరకు ఈ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు.

ఇవీ చూడండి:భాగ్యనగరం వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్​ షో

Last Updated : Mar 28, 2019, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details