హైదరాబాద్ పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ఏనుగు అంబారీపై అమ్మవారి ఘట ఊరేగింపు ప్రారంభమైంది. అక్కన్న మాదన్న దేవాలయం, మిరళం మండి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం, దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం, శాలిబండ, చార్మినార్, మదీన మీదుగా కొనసాగించి మూసీనదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేవీ రమణాచారి, అంజనీ కుమార్ పాల్గొన్నారు.
ఏనుగు అంబారిపై అమ్మవారి ఊరేగింపు - ghatalu
హైదరాబాద్ పాతబస్తీలో సామూహిక ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కళాకారుల నృత్యాలతో ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు జరిగింది.
ఏనుగు అంబారిపై అమ్మవారి ఊరేగింపు