ఈనెల 14 నుంచి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అమల్లోకి రానుందని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) వెల్లడించారు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరైన రజత్‌కుమార్ రాష్ట్రం అభిప్రాయాలు వివరిస్తామని అన్నారు. గెజిట్ అమలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారని తెలిపారు.
గోదావరిపై ఉన్న పెద్దవాగు.. బోర్డు పరిధిలో(Gazette for Jurisdiction of KRMB & GRMB)కి వెళ్తుందని.. ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తారని రజత్‌కుమార్(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) చెప్పారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు 13 వేల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్న రజత్‌కుమార్.. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుందని స్పష్టం చేశారు.