మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లోని ఓ కెమికల్ ప్లాంట్ నుంచి సల్ఫ్యూరిక్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 28కి పైగా కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. వీరంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శివాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, శివాజీనగర్ పోలీసులు, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు లీకేజీ సమస్యను పరిష్కరించారు. "మేము ఘటనా స్థలానికి చేరుకున్న గంటలోనే పరిస్థితి అదుపులోకి తెచ్చాము. బాధితులని సెంట్రల్ హాస్పిటల్‌లో చేర్చాము. ప్రాణాపాయం తప్పిది'' అని ఆర్డీఎంసీ చీఫ్ సంతోశ్ తెలిపారు.