తెలంగాణ

telangana

ETV Bharat / city

'నామీద కేసు ఎత్తివేయించే బాధ్యత కేసీఆర్​దే'​ - casea on gaddar

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ప్రజాగాయకుడు గద్దర్ ఆరోపించారు. కర్ణాటకలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన దాడిలో తన పాత్ర ఉందనడం అవాస్తవమన్నారు. తనపై కేసులు ఎత్తివేసే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'నామీద కేసు ఎత్తివేయించే బాధ్యత కేసీఆర్​దే'​

By

Published : Jul 4, 2019, 5:13 PM IST

2005లో కర్ణాటకలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన దాడిలో తను కూడా ఉన్నట్లు సమాచారం రావడం బాధ కలిగించిందని గద్దర్ అన్నారు. ఆ సమయంలో తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1990 ఫిబ్రవరిలోనే నక్సలిజం వదిలి కుటుంబంతోపాటు జనజీవన స్రవంతిలో కలిసినట్లు స్పష్టం చేశారు. 1997లో తనపై హత్యాయత్నం జరిగినప్పుడు వెన్నుపూస వద్ద బుల్లెట్ ఉండిపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే... పరారీలో ఉన్నానని అనటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను అయినందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయన్నారు. కేసులు ఎత్తివేసే బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'నామీద కేసు ఎత్తివేయించే బాధ్యత కేసీఆర్​దే'​

ABOUT THE AUTHOR

...view details