తెలంగాణ

telangana

ETV Bharat / city

Four Bills passed in Telangana Legislature : శాసనసభలో 4 బిల్లులకు ఆమోదం - తెలంగాణ శాసనసభ సమావేశాలు

తెలంగాణ శాసనసభ శుక్రవారం రోజున నాలుగు బిల్లుల(Four Bills passed in Telangana Legislature)కు ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణ మండలి చట్ట సవరణ, నల్సార్ చట్ట సవరణ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లులు(Four Bills passed in Telangana Legislature) శాసనసభ ఆమోదం పొందాయి.

Four Bills passed in Telangana Legislature
Four Bills passed in Telangana Legislature

By

Published : Oct 2, 2021, 6:57 AM IST

శాసనసభలో శుక్రవారం నాలుగు బిల్లులు(Four Bills passed in Telangana Legislature) ఆమోదం పొందాయి. గృహ నిర్మాణ మండలి చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రశాంత్‌రెడ్డి(Minister Prashanth reddy) ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన మండలిని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలిగా పేరు మార్చడంతో పాటు ముగ్గురు సభ్యుల నియామకం కోసం చట్ట సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో పది శాతం మైనారిటీలకు కేటాయించాలని అక్బరుద్దీన్‌, జాఫర్‌ హుస్సేన్‌లు, ఇళ్లను నిర్మించి.. కొనగలిగే వారికి తక్కువ ధరకు అమ్మాలని భట్టి విక్రమార్క, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రఘునందన్‌రావు కోరారు. ఇళ్ల విక్రయ పథకాలకు సీఎం పూర్తిగా వ్యతిరేకమని మంత్రి తెలిపారు.

నల్సార్‌లో స్థానికులకు 25 శాతం రిజర్వేషన్లు

న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran reddy) నల్సార్‌ చట్ట సవరణ బిల్లు(Four Bills passed in Telangana Legislature)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థుల కోటా 20 నుంచి 25 శాతానికి పెంపుదల, అందులో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశాలు ప్రతిపాదించినట్లు తెలిపారు. బీసీ-ఇ కోటాలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు.

వాటికి మార్గం సుగమం..

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు(Four Bills passed in Telangana Legislature)ను మంత్రి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan reddy) ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. దీంతో విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, ఉద్యాన రంగంలో ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు.

అక్బరుద్దీన్ నిరసన..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar rao) పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లు(Four Bills passed in Telangana Legislature)ను ప్రవేశపెడుతూ... వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికల వ్యయ నివేదికలను, గ్రామాల పేరు మార్పిడి వంటి వాటిని ఇకే దఫా సభలో ఆమోదించాలనే సవరణ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 30 రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాల్లోనే ఆమోదించాలనే నిబంధన ఇబ్బందికరంగా ఉండేదన్నారు. పేరు మార్పిడి అంశాన్ని చట్టం నుంచి పూర్తిగా తొలగించాలని మజ్లిస్‌, కాంగ్రెస్‌ సభ్యులు అక్బరుద్దీన్‌, భట్టి విక్రమార్క పట్టుబట్టారు. దీనిపై ప్రశాంత్‌రెడ్డి(Minister Prashanth reddy) మాట్లాడుతూ.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవని, చట్టంలో అలానే ఉందని తెలిపారు. దీనిపై అక్బర్‌ నిరసన తెలిపారు. రఘునందన్‌రావు బిల్లుకు మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details