ఏపీ.. కడప జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న బాలికను రామాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు.
ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం - మైలవరంలో బాలికపై వ్యక్తి అత్యాచారం వార్తలు
ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం