తెలంగాణ

telangana

ETV Bharat / city

తుగ్లక్​ తరహాలో కేసీఆర్​ పాలన: వివేక్​

పార్టీలో బలమైన, ఉద్యమ నేతలు ఉండకూడదనే తనకు ఎంపీ టికెట్​ ఇవ్వలేదని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. కేసీఆర్​ నియంతృత్వ పోకడకు భాజపా మాత్రమే బుద్ధి చెప్పగలదని, మోదీ నిర్ణయాలు చూసి ఇంకా చాలామంది భాజపాలో చేరతారని తెలిపారు.

'ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే భాజపాలో చేరుతున్నా'

By

Published : Aug 9, 2019, 3:20 PM IST

'ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే భాజపాలో చేరుతున్నా'

ముఖ్యమంత్రి కేసీఆర్​ తుగ్లక్​ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే తాను భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు సాయంత్రం వివేక్​ భాజపాలో చేరతారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. వివేక్​ చేరికతో రాష్ట్రంలో భాజపా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details