తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్​ చొరవ.. ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ సేవలు యథాతథం - తెలంగాణలో కఠినంగా లాక్​డౌన్​

నిత్యవసర, ఫుడ్‌ డెలివరీ సేవలతో పాటు ఈ-కామర్స్‌ ద్వారా జరిగే సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు డీజీపీ స్పష్టం చేశారు. లాక్​డౌన్​ను కఠినంగా అమలుచేసే చర్యల్లో భాగంగా శనివారం.. పలుచోట్ల పుడ్​ డెలివరీ సిబ్బంది సహా ఇతర ముఖ్యమైన పనులతో వెళ్తున్నవారినీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం మంత్రులు కేటీఆర్​, మహమూద్​ అలీ దృష్టికి వెళ్లడం వల్ల తక్షణ చర్యలు తీసుకున్నారు.

telangana police on food delivery
ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ సేవలు యథాతథం

By

Published : May 23, 2021, 5:31 AM IST

లాక్‌డౌన్‌ కఠినతరం చేయడంలో పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను అడ్డుకొని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర సేవలందించేవారు, ఫుడ్‌ డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ తదితర సిబ్బంది, ఇతర ముఖ్యమైన పనులపై వెళ్లే వారినీ అడ్డుకున్నారు.

ఈ విషయమై మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. అత్యవసరంగా రాకపోకలు సాగించే వారిని అడ్డుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. దీనిపై డీజీపీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇదే అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూస్తామంటూ హోంమంత్రి మహమూద్‌ అలీ ట్వీట్‌ చేశారు.

అనంతరం కొద్దిసేపటికే.. ముఖ్యమైన అవసరాలపై రాకపోకలు సాగించే వారిని, అత్యవసర సేవలందిస్తున్న వారిని అడ్డుకోవద్దని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సీపీలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిత్యవసర, ఫుడ్‌ డెలివరీ సేవలతో పాటు ఈ-కామర్స్‌ ద్వారా జరిగే సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు డీజీపీ స్పష్టం చేశారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

ఇవీచూడండి:ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details