తెలంగాణ

telangana

ETV Bharat / city

August 15 flag hoisting: పంద్రాగస్టున జిల్లాల్లో జెండా ఎగరేసే వాళ్లు వీరే..! - telangana flag hoisting

రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రదర్శించేందుకు ఇప్పటికే పోలీసులు కవాతు సాధన చేస్తున్నారు. ఇక పంద్రాగస్టున ఆయా జిల్లాల్లో పతకాన్ని ఆవిష్కరించే వారి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

flag hoisting guests declared on august 15th in 32 telangana districts
flag hoisting guests declared on august 15th in 32 telangana districts

By

Published : Aug 12, 2021, 8:21 PM IST

రాష్ట్రంలోని జిల్లాల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, అతిథుల పేర్లు ఖరారయ్యాయి. మంత్రులు, ఇతర ప్రముఖులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మిగతా 32 జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని పతాకావిష్కరణ చేసే వారి పేర్లను సాధారణ పరిపాలనా శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాల వారిగా పతాకావిష్కర్తలు...

  • ఆదిలాబాద్ - ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
  • భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
  • జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
  • జయశంకర్ భూపాలపల్లి - ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు
  • జనగాం - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • జోగులాంబ గద్వాల - ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి
  • కామారెడ్డి - శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  • కరీంనగర్ - మంత్రి గంగుల కమలాకర్
  • కుమురంభీం ఆసిఫాబాద్ - ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
  • మహబూబ్​నగర్- మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • మహబూబాబాద్ - మంత్రి సత్యవతి రాఠోడ్
  • మంచిర్యాల- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
  • మెదక్- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • మేడ్చల్ మల్కాజిగిరి - మంత్రి మల్లారెడ్డి
  • ములుగు - ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు
  • నాగర్ కర్నూల్ - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
  • నల్గొండ - మంత్రి మహమూద్ అలీ
  • నారాయణపేట - ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ
  • నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • నిజమాబాద్ - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
  • పెద్దపల్లి- ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి
  • రాజన్న సిరిసిల్ల - మంత్రి కె.తారక రామారావు
  • రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • సంగారెడ్డి - మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి
  • సిద్దిపేట - మంత్రి హరీశ్​ రావు
  • సూర్యాపేట - మంత్రి జగదీష్ రెడ్డి
  • వికారాబాద్ - శాసనసభ ఉపసభాపతి పద్మారావు
  • వనపర్తి - మంత్రి నిరంజన్ రెడ్డి
  • వరంగల్ - జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
  • హన్మకొండ - ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
  • యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

ABOUT THE AUTHOR

...view details