Fish Andhra : ఏపీలో త్వరలోనే చేపలు, పీతలు, రొయ్యల వాహనాలు రోడ్డెక్కనున్నాయి. చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి రాష్ట్రంలోనే అధికంగా ఉంది. చేపలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడా సాగు పెరుగుతున్న రీత్యా.. రొయ్యల ఎగుమతి విదేశాలకు అధికంగా ఉంటుంది. కానీ ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు రాష్ట్రంలోనే వినియోగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించే విధంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఆంధ్ర’ బ్రాండ్ పేరుతో ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.
FISH ANDHRA:‘ఫిష్ ఆంధ్ర’ ప్రాజెక్టు.. ఇంటివద్దకే చేపల ఉత్పత్తులు
Fish Andhra : ఏపీలో రేషన్ బియ్యమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు, వాటి ఆధారిత ఉత్పత్తులు కూడా త్వరలో ఇళ్ల ముంగిటకే రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని రాష్ట్రంలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో హబ్‌లు, రిటైల్ ఔట్‌లెట్లు, ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ కామర్స్ యాప్ ద్వారా అందుబాటులోకి..
e commerce app: తాజా చేపలు, రొయ్యలనే కాకుండా.. ఎండు, వండడానికి సిద్ధంగా ఉండే చేపలు, మసాలా పట్టించిన ఉత్పత్తులు, వండిన, ఫ్రై చేసిన వంటకాలు, పచ్చళ్లు వంటి వాటిని రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఒక్కో హబ్‌కు అనుబంధంగా మత్స్య ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే యూనిట్లతో పాటు 14వేల వరకు రిటైల్ అవుట్‌లెట్లు, రిటైల్ వెండింగ్ ఫుడ్‌కోర్ట్, మొబైల్ యూనిట్లు ఉంటాయి. ఏపీలో ఇప్పటి వరకు 56 హబ్‌లు సిద్ధం చేశారు. వీటి పరిధిలో దుకాణాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కామర్స్ యాప్ ద్వారా వీటిని అందించనున్నారు. మొబైల్ వాహనాల ద్వారా లైవ్ ఫిష్, ఇతర ఉత్పత్తులను విక్రయించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. వాహనాలూ సిద్ధం చేశారు. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో జిల్లాకు కనీసం 10 నుంచి 15 వాహనాల వరకు అందిస్తున్నారు.
ఇదీ చదవండి