భారీ వర్షాలకు ఓ ఇల్లు చేపలతో నిండిపోయింది. అవి చిన్న చేపలు అనుకుంటే పొరపాటే అవుతుంది. వాటిని చూస్తేనే.. ఔరా అనక తప్పదు మరి. గ్యాస్కట్, బొచ్చ చేపలు ప్రవాహంతో పాటు ఇంట్లోకి దూరి.. బందీలుగా మారిపోయాయి. ఇళ్లల్లోకి చేపలు రావడం చూసి బాధితులు కాసింత సంతోషంగా వ్యక్తం చేస్తున్నా వరదలతో మాత్రం లబోదిబోమంటున్నారు.
వర్షం కురిసెన్.. చెరువులు పొంగెన్.. చేపలు వచ్చెన్ - fishes in houses with flood water
ఇంటి నిండా చేపలు ఉంటే ఎలా ఉంటుంది.. అది కూడా పెద్ద చేపలు అయితే ఇంకెలా ఉంటుంది.. అవును మరి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు .. భారీ వింతల్నే చూపిస్తున్నాయి. మరి వాటిని చూసేద్దామా!
ఏమో! చేపలు నిండావచ్చు.. స్తంభం కదలావచ్చు..