ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మరణించారు. ఉదయబాబు అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో విడిగా పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యి సెగకు మంటలు అంటుకొని వేగంగా వ్యాపించాయి. ఆ మంటల్లో ఇల్లు తగులబడింది.
ఇంటి లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కృపాబాయి (2) సజీవ దహనం కాగా.. పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శివనాయక్(3) మృతి చెందాడు.