విద్యుదాఘాతం కారణంగా ఓ ఇంట్లో కంప్యూటర్ తదితర వస్తువులు కాలి బూడిదైన ఘటన కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో చోటుచేసుకుంది. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు ఇంటి యజమాని లక్ష్మితోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఇంటి యజమాని తలుపులు పగలగొట్టి మంటలు ఆర్పే యత్నం చేశారు . ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. టీవీలో తలెత్తిన విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం సంభవించిందని... టీవీ, కంప్యూటర్ తదితర లక్ష రూపాయల వస్తువులు కాలిపోయాయని బాధితుడు నందిగామ ఫణి తెలిపారు.
ఇంట్లో అగ్నిప్రమాదం... సామగ్రి దగ్ధం - fire
కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగా లక్ష రూపాయల విలువ గల వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.
ఇంట్లో అగ్నిప్రమాదం... సామగ్రి దగ్ధం