జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్‌ట్యాక్స్ చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. జనవరి 1వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల్లోని అన్ని వరుసల్లో ఫాస్టాగ్ ద్వారానే వంద శాతం పన్ను చెల్లింపు విధానాన్ని అమలుచేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఫాస్టాగ్ అమలును ఫిబ్రవరి 15 వరకు సడలిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిబ్రవరి 15 వరకు నగదు చెల్లింపునకు వెసులుబాటు
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్‌ట్యాక్స్ చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఫాస్టాగ్ అమలును ఫిబ్రవరి 15 వరకు సడలిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ప్లాజా పరిధిలో హైబ్రిడ్ పేరిట ఒక్కో మార్గాన్ని నగదు చెల్లింపు కోసం కేటాయించారు. 2017, డిసెంబరు 1వ తేదీ తరవాత తయారైన అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు కూడా ఫాస్టాగ్‌ను అనివార్యం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా వాహనదారులకు వెసులుబాటు కల్పించేందుకు వీలుగా గడువు పొడిగించినట్లు పేర్కొంది. అప్పటి (ఫిబ్రవరి 15) వరకు ప్రస్తుతం మాదిరిగానే ప్రతి టోల్‌ప్లాజా పరిధిలో ఒక్కో మార్గంలో నగదు రూపంలో టోల్‌టాక్స్‌ను చెల్లించవచ్చని, ఆ తరవాతి నుంచి వంద శాతం ఫాస్టాగ్‌ను అమలుచేస్తామని కేంద్రం తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ద్వారానే టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉండటంతో చాలా ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు గురువారం ఉదయం నుంచే ఫాస్టాగ్ కోసం బారులుదీరారు.