తెలంగాణ

telangana

ETV Bharat / city

తుళ్లూరులో ఉద్రిక్తత: రాళ్లదాడిని నిరసిస్తూ చలిలోనే మహిళల ఆందోళన

రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ.. ఏపీ అమరావతి పరిరక్ష ఉద్యమం చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి న్యాయం కోరుతూ.. రాత్రంతా చలిని సైతం లెక్క చేయకుండా తుళ్లూరు దీక్షా శిబిరంలో ఆందోళన కొనసాగించారు.

farmers-protest-over-stone-attack-at-amaravathi
తుళ్లూరులో ఉద్రిక్తత: రాళ్లదాడిని నిరసిస్తూ చలిలోనే మహిళల ఆందోళన

By

Published : Dec 7, 2020, 8:45 AM IST

రాళ్ల దాడి ఘటనపై ఏపీ తుళ్లూరులో రైతులు, మహిళల ఆందోళన కొనసాగుతోంది. ఉద్దండరాయుని పాలెంలో రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తుళ్లూరు దీక్షా శిబిరంలోని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాత్రి నుంచి రహదారిపైనే రైతులు, మహిళలు నిరసన తెలిపారు. 3 రాజధానుల శిబిరం తొలగించే వరకూ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ఉద్రిక్త పరిస్థితులతో.. తుళ్లూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామని రైతులు తెలిపిన మేరకు.. భద్రత విషయంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

'ప్రభుత్వ సహకారంతో ఆందోళన చేసే వారితో తన్నులు తినాలా?'

తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించాలని డీఎస్పీ జగన్నాథం.. రైతులను కోరారు. దీక్షా శిబిరంలో ఆందోళన చేసుకోవాలన్నారు. ఆ సూచనను తోసిపుచ్చిన రైతులు.. తమ ప్రాణాలకు పోలీసులే భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో ఉద్యమం చేసే వారితో కూడా తన్నులు తినాలా? అని ప్రశ్నించారు. తమ భూముల్లో వారికి ధర్నా చేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని పోలీసులను రైతులు నిలదీశారు.

ఇదీ చూడండి :తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details