Veldurthy Farmers Innovative thinking: ఏపీలోని గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని రైతులు తమకు అందకుండా వెళ్తున్న వాగు నీటిని ఒడిసిపట్టడంలో భగీరథ స్ఫూర్తి కనబరుస్తున్నారు. మండలంలోని గంగలకుంట, గొట్టిపాళ్ల, కండ్లకుంట, గుండ్లపాడు, కొత్తపుల్లారెడ్డిగూడెం ప్రాంతాల్లో వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరుపడదు.
Farmers Innovative thinking: వాగు నీటిని ఒడిసిపట్టి.. రైతుల భగీరథ స్ఫూర్తి.. - గుంటూరు జిల్లా వార్తలు
Veldurthy Farmers Innovative thinking: వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో వినూత్నంగా ఆలోచించారు ఆ రైతులు. తమకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు నీటిని ఒడిసిపడుతున్నారు. నీటిని తమ గ్రామాలకు మళ్లించుకోవడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
వెల్దుర్తి రైతుల భగీరథ స్ఫూర్తి
దీంతో రైతులు ఇక్కడి నుంచి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మరసపెంట సమీపంలోని జెర్రివాగుపై మోటార్లు పెట్టుకున్నారు. ఇందుకోసం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి మోటార్లు, ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు, పైపులైన్లు వేసుకున్నారు.