onion farmer Protest: ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని.. ఓ రైతు గుండె మండింది. తీవ్ర ఆవేదనతో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు.. మార్కెట్ సాక్షిగా నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లిపాయలు తెచ్చారు. ఈ-నామ్ పద్ధతిలో కేవలం రూ.350 ధర పలకగా ఆగ్రహించిన రైతు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.