ఏపీ రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతోందనే బాధతో తుళ్లూరుకు చెందిన జమ్ముల గోపాలరావు గుండెపోటుతో మృతిచెందారు. అమరావతి నిర్మాణానికి రైతు తనకున్న ఎకరం పొలాన్ని భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. కొన్ని రోజులుగా తుళ్లూరులో జరుగుతున్న అమరావతి ఉద్యమంలో గోపాలరావు చురుగ్గా పాల్గొన్నారు. గోపాలరావు మృతి పట్ల తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు సంతాపం ప్రకటించారు.
అమరావతి ఉద్యమం: ఆగిన మరో రైతు గుండె - AMARAVATHI LATEST NEWS
ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. 359 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ప్రాణాలు పోతున్నా చలనం లేదని వాపోతున్నారు. తుళ్లూరులో ఓ రైతు గుండెపోటుతో చనిపోయారు. గోపాలరావు మృతి పట్ల దీక్షా శిబిరంలో రైతులు సంతాపం ప్రకటించారు.
అమరావతి ఉద్యమం: ఆగిన మరో రైతు గుండె