తెలంగాణ

telangana

ETV Bharat / city

హ్యాపీ బర్త్​డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ - విత భారీ రంగోళి చిత్రం

ఎమ్మెల్సీ కవితకు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపాడు ఓ వీరాభిమాని. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో 60 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పుతో కవిత భారీ చిత్రాన్ని వేయించారు. తన అభిమాన నాయకురాలు కవితకు బర్త్​డే విషెస్​ తెలిపారు.

fan Verity Birthday  wishes To Mlc Kavitha
fan Verity Birthday wishes To Mlc Kavitha

By

Published : Mar 13, 2021, 10:44 AM IST

భారీ రంగోళి చిత్రంతో ఎమ్మెల్సీ కవితకు బర్త్​డే విషెస్​

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా... ఆమె అభిమాని వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. నిజమాబాద్ అర్బన్ జిల్లా తెరాస యువ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్... మహారాష్ట్రకు చెందిన చిత్రకారులతో నేలపై 60 అడుగుల కవిత చిత్రాన్ని వేయించారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో 60 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ కళాఖండంపై "హ్యాపీ బర్త్​డే కవితక్క" అని రాశారు.

పూణేకు చెందిన ప్రఖ్యాత భారీ రంగోళి చిత్రకారుడు శైలేష్ కులకర్ణి... ఆరుగురు బృందంతో కలిసి ఈ భారీ చిత్రాన్ని అందంగా రూపొందించారు. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు. కవిత మీద అభిమానంతో లక్ష రూపాయల వ్యయంతో ఈ పెయింటింగ్ వేయించినట్లు సాయి ప్రసాద్ తెలిపారు.

జాగృతి సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు కవిత ఎంతో ఖ్యాతి తెచ్చారని సాయిప్రసాద్​ కొనియాడారు. ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించడంతో పాటు... అడిగినా వెంటనే తోచిన సాయం చేస్తారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి... రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా... భారీ చిత్రం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శ కులు పోటీపడ్డారు.

ఇదీ చూడండి: 'స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం'

ABOUT THE AUTHOR

...view details