ఏపీలోని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు బుధవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ద్వారా అంత్యక్రియల కోసం పేర్నమెట్ట తీసుకువచ్చారు. ఉపాధ్యాయురాలు కరోనాతో మృతి చెందిందని గ్రామస్థులు భావించి.. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించకూడదని పట్టుపట్టారు. ఈ క్రమంలో మృతురాలు బంధువులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కరోనా భయం.. అంత్యక్రియల అడ్డగింత.. కోర్టుకు పంచాయితీ.. ఆపై..? - అంత్యక్రియలను అడ్డుకున్న పేర్నమిట్ట గ్రామస్థులు
అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలి అంత్యక్రియలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కరోనాతో మృతి చెందినట్లు భావించి శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో మృతురాలి బంధువులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. మృతురాలి బంధువులు కోర్టును ఆశ్రయించడంతో... న్యాయమూర్తి ఆదేశాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి..!
ఏపీలో కరోనా అనే అనుమానంతో అంత్యక్రియల అడ్డగింత
గ్రామస్థుల అభ్యంతరంపై మృతురాలి బంధువులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌కు ఆర్జీ పెట్టుకున్నారు. న్యాయసేవాధికారి సంస్థ స్పందించి అంత్యక్రియలు చట్టపరంగా లభించిన హక్కు అంటూ అంత్యక్రియలను నిర్వహించేందుకు పోలీసులు సహకరించాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి అంత్యక్రియలకు అవకాశం కల్పించిన న్యాయసేవాధికార సంస్థకు మృతురాలి కుమారులు కృతఙ్ఞతలు తెలిపారు.
- ఇదీ చదవండి:పిల్లలు బరువు పెరగాలంటే ఇలా చేయాలి