స్వీయ మరణాలకు అనుమతించండి.. గవర్నర్కు, హైకోర్టు సీజేకు లేఖ న్యాయం చేయాలని కోర్టు ఉత్తర్వ్యులు జారీ చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో జీవనం సాగించలేని పరిస్థితి నెలకొంది. తమ కుటుంబ సభ్యుల స్వీయ మరణాలకు అనుమతి ఇవ్వాలని ఏపీ గవర్నర్కు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ రామచంద్రాపురానికి చెందిన రాజు అనే వ్యక్తి వినతిపత్రాలు పంపారు.
గోడు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్న రాజు కుటుంబ సభ్యులు సామాజిక బహిష్కరణ..
రామచంద్రాపురానికి చెందిన కోడూరి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ మాజీ సభ్యుడు. గ్రామ భూమికి సంబంధించి పాసుపుస్తకాలు చేయించుకున్నారన్న ఆరోపణలతో స్థానిక పెద్దలు గతంలో ఆయనను ప్రశ్నించారు. అప్పటి నుంచి గ్రామంలో వివాదం ప్రారంభమైంది. తరువాత వెంకటేశ్వర్లు కుటుంబానికి చెందిన పడవ, వలలు, ఇంజిన్‌ను కొందరు వ్యక్తులు గత ఏడాది అపహరించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయడంతో వివాదం మరింత పెరిగింది.
గోడు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్న రాజు కుటుంబ సభ్యులు న్యాయం జరగలేదు..
చివరకు జిల్లా స్థాయి అధికారులు గ్రామంలో సమావేశాలు నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ వారు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు రాజు బతుకుతెరువు కోసం ఇటీవల నెల్లూరు వెళ్లి కొద్ది రోజుల తర్వాత గ్రామానికి రావడంతో... కొందరు ఆయనపై దాడి చేశారు. అదే రోజు వేటపాలెం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. చేపల వేటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వీయ మరణాలకు అనుమతి ఇవ్వాలని ఏపీ గవర్నర్కు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సీఎంకు చిన్నారి లేఖ..
ఈ నేపథ్యంలో తనతో పాటు తన తండ్రి, తల్లి, భార్య, ఇద్దరు పిల్లల స్వీయ మరణాలకు అనుమతి ఇప్పించాలని... ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజు వినతిపత్రాలు పంపారు. కాగా గత ఏడాది క్రితం ఇదే విషయమై తాము పడుతున్న ఇబ్బందులను.. ఈ కుటుంబంలోని చిన్నారి ఏపీ సీఎం జగన్కు ఉత్తరం రాసింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా దాడులు