ఏపీలోని ప్రకాశం జిల్లా మార్టూరులోని శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. కార్యాలయ కిటికీ పగలగొట్టి లోపలకు వెళ్లిన దుండగుడు... లాకర్ తెరిచే ప్రయత్నం చేశాడు. గునపంతో లాకర్ పగలగొట్టేందుకు యత్నించాడు. అయితే అవి తెరుచుకోలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్టూరు శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం - శ్రీరామ్ చిట్స్‌లో దొంగతనం వార్తలు
చిట్‌ఫండ్ కార్యాలయంలో దొంగతనానికి ప్రయత్నించాడో యువకుడు. పలుగుతో లాకర్ తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ లాకర్ తెరుచుకోలేదు సరికదా... అతను చేసిన ప్రయత్నమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
మార్టూరు శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం