కరోనా సోకిన వారికి నెగిటివ్ వచ్చి కోలుకున్న తర్వాత కూడా బాధితులను బ్లాక్‌ఫంగస్(black fungus) భయపెడుతోంది. కేవలం రోగనిరోధక శక్తి(immunity) తక్కువగా ఉండటం వల్లే ఈ ఫంగస్ సోకుతోందని నిపుణులు చెబుతున్నా... పలు వార్తలు బాధితులను ఆందోళనలో పడేస్తున్నాయి.
Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా..? - immunity
కరోనా(corona) మహమ్మారి తర్వాత జనాలను భయపెడుతున్న సమస్య బ్లాక్‌ఫంగస్(black fungus). కొవిడ్ సోకిన వారిలోనే కనిపిస్తోన్న ఈ లక్షణాలకు కారణాలపై... సోషల్ మీడియా(social media)లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా కూరగాయలు తినటం వల్ల, లేదా ఫలానా కారణాల వల్లే ఈ బ్లాక్ ఫంగస్ వస్తోందని జనాలను మరింత భయపెట్టే మెసేజ్(messages)లు వైరల్ అవుతున్నాయి. మరి వాటిలో నిజమెంత...?
నల్లగా ఉండే ఉల్లిగడ్డల(onions) ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తోందని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారమవుతోంది. దీంతో పాటు ఫ్రిజ్‌లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని జనాలు పలు మెస్సేజ్‌లు భయపెడుతున్నాయి. ఈ వార్తలపై స్పందించి ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా(aiims chief randeep guleria) ఓ స్పష్టతనిచ్చారు.
ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తుందన్న వార్తలు పూర్తిగా అసత్యం(Fake) అని గులేరియా స్పష్టం చేశారు. రిఫ్రిజిరేటర్(refrigerator)లో నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతుందనేది అవాస్తవమన్నారు. ప్రజలు ఇటువంటి ఫేక్‌న్యూస్(Fake news) నమ్మి భయపడొద్దని సూచించారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ఫంగస్ రాదని స్పష్టం చేశారు. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుందని... దాన్ని శుభ్రం చేసుకుని వాడుకుంటే ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు.