కరోనా తీవ్రత పరిస్థితుల కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది కూడా ఎఫ్ఏ మార్కుల ఆధారంగానే ఫలితాలను వెల్లడించారు. కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేడ్లను ఖరారు చేసేందుకు వివిధ అంశాలను పరిశీలించిన విద్యా శాఖ... చివరకు గతేడాది విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎఫ్ఏ వన్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. సంబంధిత దస్త్రంపై విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. త్వరలో జీవో జారీ కానుంది. ఉత్తర్వులు వెలువడగానే ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేయనున్నారు.
పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై కసరత్తు - telangana varthalu
పదో తరగతి ఫలితాల వెల్లడికి కసరత్తు జరుగుతోంది. గతంలో మాదిరిగానే ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జీవో జారీ కానుంది. పరీక్ష రుసుము చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసి... గ్రేడ్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వారం రోజుల్లో విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఎఫ్ఏ వన్‌లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి.. తుది మార్కులను వేయనున్నారు. ఉదాహరణకు ఎఫ్ఏ వన్‌లో 20కి 19 మార్కులు వస్తే.... 100కి 95 మార్కులు ఇస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున... మొత్తం 60 పాయింట్లకు.. ఎన్ని పాయింట్లు వస్తాయో లెక్కించి గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. ఉదాహరణకు అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వస్తే ఏ వన్ గ్రేడు, 10జీపీఏ ఇస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు మార్కుల మెమోలను పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!