తెలంగాణ

telangana

ETV Bharat / city

Adi narayana: 'వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలి' - వివేకా హత్య కేసు నిందితులు

వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలని ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపైనా కూడా కొందరు ఆరోపణలు చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయాలన్నారు.

minister
వైఎస్

By

Published : Aug 15, 2021, 5:40 PM IST

వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలని ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయాలన్నారు. తనపైనా కొందరు ఆరోపణలు చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి వివేకా కుమార్తెకే రక్షణ లేదన్న ఆదినారాయణ.. ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. సొంత చెల్లెలు షర్మిల రాజకీయ వాటా అడిగిన కారణంతోనే ఆమెను ముఖ్యమంత్రి జగన్ దూరం పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైన పాలన కొనసాగుతోందని.. రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రాన్ని కోల్పోయారని విమర్శించారు.

ఇదీ చదవండి:CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details