Ex Cricketer vvs Lakshman: అందరిలాగానే తానూ డాక్టర్ కావాలని కలలు కనేవాడినని... అనుకోకుండా క్రికెట్ వైపు వెళ్లానని జాతీయ క్రికెట్ అకాడమీ సంచాలకులు, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి... హైదరాబాద్ సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఒప్పంద పత్రాలపై మణిపాల్ ఆస్పత్రి హెడ్ సుధాకర్, ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు టామ్ చెరియన్ సంతకాలు చేశారు.
Ex Cricketer vvs Lakshman: డాక్టర్ కావాలనుకున్నా... కానీ అనుకోకుండా క్రికెట్ వైపు.. - వీవీఎస్ లక్ష్మణ్
Ex Cricketer vvs Lakshman: ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి... హైదరాబాద్ సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Lakshman
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలో రెండు ఆస్పత్రులూ కలిసి పనిచేయనున్నట్లు మణిపాల్ ఆస్పత్రి అధికారి సుధాకర్ చెప్పారు. కొవిడ్ సమయంలో వైద్యుల సేవలను అంతా కీర్తించారని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. కొవిడ్ బాధితుల వద్దకు వచ్చేందుకు వాళ్ల బంధువులే భయపడినా.. వైద్యులు ధైర్యంగా చికిత్స అందించారని కొనియాడారు. కాలేయ దానానికి అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:Bandi Sanjay comments on KCR: 'కలెక్టర్లకు కేసీఆర్.. ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారు'