మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి
భారీ వర్షాలు భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు నగరం అతలాకుతలమైంది. పాతబస్తీ బహదూర్‌పురాలో ఓ వ్యక్తి మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు భయానక పరిస్థితిని సూచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అడవిలో అలజడి
కొంతకాలంగా ఏజెన్సీల్లో అలజడి కొనసాగుతోంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మంగపేట అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భర్త వేధింపులే...
తమ కూతురు, అల్లుడు బంగారు భవిష్యత్తును ఊహించుకుంటున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అడ్డుకట్టపడింది. పెళ్లైన ఆరు నెలలకే కన్నవారికి ఆమె కడుపుకోతను మిగిల్చింది. ఈ ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటర్ టాక్సీలు ప్రారంభం
కేరళవాసుల కోసం అక్కడి ప్రభుత్వం.. మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. తొలిసారిగా 'వాటర్ టాక్సీ' సేవలను ప్రారంభించింది. కాటమరాన్ పడవలతో ఈ సేవలను అందిస్తోంది ఆ రాష్ట్ర జల రవాణా శాఖ. అలప్పుజ రేవులో ఈ పడవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చివరి దశకు కరోనా!
కరోనా జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కొవిడ్ ప్రత్యేక కమిటీ తెలిపింది. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా వెళ్తోందని.. తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతేనే లాక్‌డౌన్ విధించాలని పేర్కొంది. బహిరంగంగా గుంపులుగా చేరడం కారణంగా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిరూపించడానికి కేరళలో నిర్వహించిన ఓనం పండగ ఓ ఉదాహరణగా కమిటీ చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.