తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

By

Published : Oct 27, 2020, 9:09 PM IST

1. దీక్ష విరమణ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 12మంది సురక్షితం

వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన జీపు వ్యవసాయ బావిలో పడిపోయింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి మొదటగా 12 మంది సురక్షితంగా బయటపడగా.. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు మరొకరిని కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పోలీసుల మీద నమ్మకం లేదు

స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలని భాజపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ప్రధాని మోదీ సమీక్ష

దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ప్రభావంతో కుప్పకూలిన ఆర్థిక రథాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మరో భారీ ప్యాకేజీ తెచ్చే అవకాశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రైతులకు కేరళ ప్రభుత్వం అండ

కేరళ రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. రాష్ట్రంలో పండించే 16 రకాల కూరగాయలకు కనీస ధర నిర్ణయించింది. మార్కెట్​ ధర తగ్గినా కనీస ధరకే పంటను కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. నవంబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రాజకీయ దుమారం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బిహార్​ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు తీవ్రతరం చేశారు. వారసుడు కావాలనే కోరికతో 9 మంది పిల్లలను కన్నవారితో రాష్ట్రాభివృద్ది జరుగుతుందా? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై లాలూ కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. శారీరకంగా, మానసికంగా అలసిపోయినందు వల్లే నితీశ్​ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మాస్క్ ధరించడం తప్పనిసరి!

ప్రపంచ దేశాలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 38 లక్షల 84 వేలమందికి పైగా కరోనా​ బారిన పడ్డారు. 11 లక్షల 66 వేల మందికి పైగా కొవిడ్​తో మృతి చెందారు. రష్యా,ఇరాక్, మెక్సికో, పోలాండ్​​ దేశాల్లో కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మంచి వృద్ధిరేటు సాధిస్తాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు సున్నాకు దగ్గరగా ఉంటుందని అంచనా వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆశ్చర్యకర నిర్ణయాలు!

ఈ ఏడాది ఐపీఎల్​లో కొందరు కెప్టెన్లు తీసుకున్న నిర్ణయాలు అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. నరైన్​ మిడిలార్డర్​లో రావడం, డివిలియర్స్ లోయర్ ఆర్డర్​లో బ్యాటింగ్ చేయడం వంటివి ఫ్యాన్స్​ను అయోమయంలో పడేశాయి. మరి ఈ సీజన్​లో ఇప్పటివరకు తీసుకున్న టాప్-5 ఆశ్చర్యకర నిర్ణయాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. క్షమించండి

ప్రముఖ నటుడు విజయ్​ సేతుపతి కుమార్తెపై అత్యాచార బెదరింపులు చేసింది తానేనని, క్షమించాలంటూ శ్రీలంకకు చెందిన ఓ యువకుడు నెట్టింట్లో ఓ వీడియో పోస్ట్​ చేశాడు. మానసికంగా ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశానని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details