1. 8 బిల్లులకు శాసనసభ ఆమోదం
శాసనసభ ఇవాళ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 21 రోజుల్లోనే అనుమతులు
టీఎస్ బీపాస్ అమలుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పరిమిత కాలంతో నిర్మాణాలకు అనుమతులు ఇస్తామన్నారు. టీఎస్ బీపాస్ బిల్లును శాసన సభలో మంత్రి ప్రవేశపెట్టారు. బిల్లు అమలు విషయంలో లోతుగా అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాజ్యసభ సభ్యులకు కేకే, సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికైన సభ్యులు తొలిరోజున ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కె.కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి సభలో ప్రమాణం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ప్రణబ్‌కు రాజ్యసభ సంతాపం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవల మరణించిన ముగ్గురు సిట్టింగ్ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 17 మంది ఎంపీలకు కరోనా
పార్లమెంటు సమావేశాల వేళ ఎంపీల్లో కరోనా కలకలం రేపింది. ఏకంగా 17 మంది పార్లమెంట్ సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్
కోర్టు ధిక్కరణ కేసులో అత్యున్నత న్యాయస్థానం విధించిన జరిమానా ఒక్క రూపాయిని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెల్లించారు. కానీ, తాను తీర్పును అంగీకరించలేదని, రివ్యూ పిటిషన్ వేస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నావల్నీపై విష ప్రయోగం నిజమే
రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం జరిగిందని ప్రాన్స్, స్వీడన్‌లోని ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఈ విషయాన్ని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 2021లో భారత వృద్ధి రేటు ఎంతంటే?
2021లో భారత వృద్ధి రేటు -9శాతానికి పరిమితమవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశంలో పెరుగుతున్న కేసులు ఇందుకు ఓ కారణమని తెలిపింది. గతంలో ఇదే సంస్థ.. భారత వృద్ధి రేటు -5శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధోనీ లేకుండా ఐపీఎల్ జట్టు
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఈ ఏడాది ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో ధోనీకి చోటు కల్పించకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. బొబ్బిలి రాజాకు 30 ఏళ్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా, బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బొబ్బిలి రాజా'. 1990 సెప్టెంబరు 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నేటితో ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.