తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @7PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @7PM

By

Published : Sep 13, 2020, 6:59 PM IST

1. కోతులకు అరటిపండ్లు అందించిన సీఎం

యాదాద్రి ఘాట్​రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపు... ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది. ఆకలితో అలమటిస్తున్న వానరాలకు స్వయంగా కేసీఆర్ అరటిపండ్లు అందించి... వాటి ఆకలిని తీర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ప్రశాంతంగా ముగిసిన నీట్

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ... దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష... సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. నిబంధనలను పాటిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 112 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. వానలే... వానలు

ఆంధ్రప్రదేశ్​ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కాంగ్రెస్​ వ్యూహం

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంట్​ సమావేశాల్లో చర్చ జరపాలని కాంగ్రెస్​ పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు. లద్దాఖ్​లో చైనా ఆక్రమణల వివరాలను మోదీ సభలో ప్రకటించాలని డిమాండ్​ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. సొంతూరు కోసం

తన భార్య మరణానికి కారణమైన కొండను తొలిచి రోడ్డును నిర్మించిన దశరథ్​ మాంఝీ కథ మనందరికీ తెలుసు. అలాంటి కథే.. ఇప్పుడు మీరు చదవబోయేది. స్వలాభం కోసం కాకుండా​ తన ఊరు కోసం... తాను ఒక్కడే ఓ మహత్తర కార్యక్రమానికి నడుంకట్టి... గడ్డపార చేతపట్టి కాలువను తవ్వాడు. 30 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించి, 3 కిలోమీటర్ల కాలువను తవ్వాడు ఆరు పదుల కెనాల్​ మ్యాన్​. ఆయనలో ఈ ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఆ దేశం వల్లే ప్రపంచ శాంతికి ముప్పు

చైనా సైనిక ఆశయాలపై అమెరికా ఇటీవలే ఓ నివేదికను రూపొందించింది. అయితే ఈ విషయంపై చైనా ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి అమెరికాతోనే ప్రపంచ శాంతికి ముప్పుపొంచి ఉందని ఆరోపించింది. తమ సైన్యంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. రష్యాలో వ్యాక్సిన్​ పంపిణీ షురూ

తాము రూపొందించిన కరోనా టీకాలు సోమవారం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని రష్యా ప్రకటించింది. పరీక్షల నిమిత్తం తొలి బ్యాచ్​ను ఇప్పటికే తరలించినట్టు... ప్రస్తుతం పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నట్టు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్​ మురషుకో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఎంఎస్​ఎంఈలకు భారీగా రుణాలు

లాక్​డౌన్​తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ)ను ఆదుకునేందుకు.. అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద బ్యాంకులు రూ.1.63 లక్షల కోట్లు మంజూరు చేశాయి. మొత్తం 42 లక్షల ఎంఎస్ఎంఈలకు.. సెప్టెంబర్ 10 నాటికి ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. రాయల్స్ బలాలు, బలహీనతలు

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగబోతుంది. ఈ మెగా లీగ్ కోసం ఇప్పటికే జట్లన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ టోర్నీ ప్రారంభ సీజన్​లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో నిలిచింది. మరి ఈసారైనా ఈ జట్టును అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. ఐపీఎల్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. మహారాష్ట్ర గవర్నర్​తో కంగన భేటీ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్​, శివసేన పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోష్యారీతో సమావేశమైంది కంగన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details